Iran: వేల్స్‌పై ఇరాన్ గెలుపు కిక్కు..
ABN , First Publish Date - 2022-11-30T02:13:56+05:30 IST
ఫిఫా ప్రపంచక్‌పలో ఇరాన్ జట్టు గెలుపొందడం ఆ దేశ ఖైదీలకు వరంగా మారింది. రెండ్రోజుల క్రితం ఫిఫా కప్ మ్యాచ్‌లో ఇరాన్ 2-0తో పటిష్ఠ వేల్స్ జట్టును ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

700 మంది ఖైదీల విడుదల
టెహ్రాన్: ఫిఫా ప్రపంచక్‌పలో ఇరాన్ జట్టు గెలుపొందడం ఆ దేశ ఖైదీలకు వరంగా మారింది. రెండ్రోజుల క్రితం ఫిఫా కప్ మ్యాచ్‌లో ఇరాన్ 2-0తో పటిష్ఠ వేల్స్ జట్టును ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఆ దేశవాసులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని జైళ్లలో ఉన్న 700 మందికి పైగా ఖైదీలకు విముక్తి కలిగించినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. కాగా, విడుదలైన ఈ ఖైదీలలో చాలామంది.. ఈ మధ్య ఆ దేశంలో మహిళల డ్రెస్‌కోడ్ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న వారే. ఇందులో ఇరాన్ నటి హెంగామె గజియాని, మాజీ ఫుట్‌బాలర్ వోరియా గఫౌరిలాంటి ప్రముఖులు ఉండడం గమనార్హం.
Read more