నేటి నుంచి ఇరానీ కప్‌

ABN , First Publish Date - 2022-10-01T10:00:14+05:30 IST

పుజార నేతృత్వంలోని సౌరాష్ట్ర, విహారి కెప్టెన్సీలోని రెస్టాఫ్‌ ఇండియా జట్ల మధ్య శనివారం నుంచి ఇరానీ కప్‌ జరగనుంది.

నేటి నుంచి ఇరానీ కప్‌

రాజ్‌కోట్‌: పుజార నేతృత్వంలోని సౌరాష్ట్ర, విహారి కెప్టెన్సీలోని రెస్టాఫ్‌ ఇండియా జట్ల మధ్య శనివారం నుంచి ఇరానీ కప్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో మెరుగ్గా రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని పలువురు ఆటగాళ్లు భావిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో రెండు ఇరానీ కప్‌లు జరుగనుండడం విశేషం. 2019-20 రంజీ విజేత సౌరాష్ట్రకు కరోనా కారణంగా తర్వాతి ఏడాది ఇరానీ కప్‌ ఆడలేదు. దీంతో ఈసారి బీసీసీఐ వారికి అవకాశం కల్పించింది. తాజా రంజీ విజేత మధ్యప్రదేశ్‌-రెస్టా్‌ఫ ఇండియా జట్ల మధ్య ఈ సీజన్‌ చివర్లో మరో ఇరానీ కప్‌ జరుగనుంది.

Read more