India vs South Africa: దక్షిణాఫ్రికాని బెంబేలెత్తించిన భారత పేసర్లు.. ఇండియా ముందు ఈజీ టార్గెట్..

ABN , First Publish Date - 2022-09-29T02:14:53+05:30 IST

వికెట్ల దాహంలో ఉన్న బౌలర్లలా వేటాడారు భారత పేసర్లు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ పవర్‌ప్లేలో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు క్యూకట్టించి వెనక్కు పంపించి దడపుట్టించారు.

India vs South Africa: దక్షిణాఫ్రికాని బెంబేలెత్తించిన భారత పేసర్లు.. ఇండియా ముందు ఈజీ టార్గెట్..

తిరువనంతపురం: వికెట్ల దాహంలో ఉన్న బౌలర్లలా వేటాడారు భారత పేసర్లు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ పవర్‌ప్లేలో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు క్యూకట్టించి వెనక్కి పంపించి దడపుట్టించారు. బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానం లేనిబంతులతో అర్షదీప్ సింగ్(Arshadeep singh) బెంబేలెత్తించగా.. దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తమ సహకారం అందించడంతో పర్యాటక సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకు పరిమితమయ్యింది. దీంతో భారత్‌కు 107 పరుగుల సునాయాస లక్ష్యాన్ని నిర్దేశించింది. దీపక్ చాహర్ తొలి ఓవర్‌లో కెప్టెన్ బావుమాను ఔట్ చేసి శుభారంభం అందించగా.. ఆ తర్వాత బంతి అందుకున్న హర్షదీప్ సింగ్ 2వ ఓవర్‌లో ఏకంగా 3 వికెట్లు తీసి సౌతాఫ్రికాను చావుదెబ్బకొట్టాడు. ఇలా 42 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే పర్యాటక జట్టు గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయడంలో మార్‌క్రమ్ (25), పార్నెల్ (24), కేశవ్ మహారాజ్ (41) కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా కేశవ్ మహరాజ్ అద్భుతంగా రాణించాడు. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంలో కీలకపాత్ర పోషించాడు.


భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3), దీపక్ చాహర్ (2), హర్షల్ పటేల్ (2), అక్షర్ పటేల్ (1) చొప్పున వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌లో క్వింటన్ డికాక్(1), తెంబా బావుమా (0), రిలీ రోసో (0), ఐడెన్ మార్‌క్రమ్ (25), డేవిడ్ మిల్లర్ (0), త్రిస్టన్ స్టబ్స్ (0), వేన్ పార్నెల్(24),  కేశవ్ మహరాజ్(41), అన్రిచ్ నోర్జే (2 నాటౌట్), కసిగో రబాడ(7 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.



కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుని దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వరల్డ్ కప్‌కు ముందు చివరి సిరీస్ కావడంతో హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతినిచ్చామని, రిషత్ పంత్, అర్షదీప్ సింగ్‌లను జట్టులోకి తీసుకున్నామని రోహిత్ వెల్లడించాడు. తిరువనంపురం పిచ్ మంచి బ్యాటింగ్ ట్రాక్ అని పేర్కొన్నాడు. వరల్డ్ కప్‌కు ముందు ఇది తమకు చాలా ముఖ్యమైన సిరీస్ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా చెప్పాడు. కీలకమైన ఈ మ్యాచ్ టాస్ గెలిచుంటే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు.



Updated Date - 2022-09-29T02:14:53+05:30 IST