సెమీస్‌ చేరువలో భారత అమ్మాయిలు

ABN , First Publish Date - 2022-12-13T03:23:54+05:30 IST

ఎఫ్‌ఐహెచ్‌ హాకీ మహిళల నేషన్స్‌ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌ దిశగా దూసుకెళుతోంది. గ్రూప్‌-బిలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-1 గోల్స్‌ తేడాతో

సెమీస్‌ చేరువలో భారత అమ్మాయిలు

వాలెన్సియా (స్పెయిన్‌): ఎఫ్‌ఐహెచ్‌ హాకీ మహిళల నేషన్స్‌ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌ దిశగా దూసుకెళుతోంది. గ్రూప్‌-బిలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-1 గోల్స్‌ తేడాతో జపాన్‌ను ఓడించింది. భారత్‌ తరఫున సలీమా టెటె (5వ), డంగ్‌డంగ్‌ (40వ) చెరో గోల్‌ సాధించారు. జపాన్‌ జట్టులో ఏకైక గోల్‌ను తకషిమా (49వ) కొట్టింది. టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు చిలీపై గెలిచింది. 8 దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీలో గ్రూప్‌-బి నుంచి మొత్తం 6 పాయింట్లతో ఉన్న భారత్‌.. బుధవారం దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా నేరుగా సెమీస్‌ చేరుతుంది.

Updated Date - 2022-12-13T03:23:54+05:30 IST

Read more