ఆనంద్‌కు మూడోస్థానం

ABN , First Publish Date - 2022-06-12T06:02:36+05:30 IST

భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో మూడోస్థానంలో నిలిచాడు. కీలకమైన ఆఖరి, తొమ్మిదో రౌండ్లో స్థానిక గ్రాండ్‌మాస్టర్‌ అర్యాన్‌ టారిపై ఆర్మాగెడాన్‌ పోరు ద్వారా ఆనంద్‌ విజయం...

ఆనంద్‌కు మూడోస్థానం

కార్ల్‌సన్‌దే నార్వే టైటిల్‌


స్టావెంజర్‌ (నార్వే): భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో మూడోస్థానంలో నిలిచాడు. కీలకమైన ఆఖరి, తొమ్మిదో రౌండ్లో స్థానిక గ్రాండ్‌మాస్టర్‌ అర్యాన్‌ టారిపై ఆర్మాగెడాన్‌ పోరు ద్వారా ఆనంద్‌ విజయం సాధించాడు. మొదట క్లాసికల్‌ గేమ్‌ 22 ఎత్తుల్లో డ్రాగా ముగియగా.. సడెన్‌ డెత్‌ టైబ్రేక్‌లో అర్యాన్‌ను ఆనంద్‌ ఓడించాడు. దీంతో మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను ఆనంద్‌ 14.5 పాయింట్లతో మూడోస్థానం దక్కించుకున్నాడు.ఇక, డిఫెండింగ్‌ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ 16.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. కార్ల్‌సన్‌ ఈ వేదికపై విజేతగా నిలవడం ఇక్కడ వరుసగా నాలుగోసారి కావడం విశేషం. ఓవరాల్‌గా అతనికిది ఐదో టైటిల్‌. అజర్‌బైజాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ షక్రియార్‌ మమెద్యరోవ్‌ 15.5 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. 

Read more