India vs South Africa 1st ODI: చెలరేగి ఆడిన క్లాసెన్, మిల్లర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-10-07T00:40:20+05:30 IST

వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన టీమిండియా, సౌతాఫ్రికా తొలి వన్డేలో సఫారీ జట్టు 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని..

India vs South Africa 1st ODI: చెలరేగి ఆడిన క్లాసెన్, మిల్లర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

లక్నో: వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన టీమిండియా, సౌతాఫ్రికా తొలి వన్డేలో సఫారీ జట్టు 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. 40 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు చెప్పుకోదగ్గ స్కోరే చేసింది. టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టు 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మలాన్ (22) ఠాకూర్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్‌గా దొరికి పెవిలియన్ బాట పట్టాడు. మరో ఓపెనర్ క్వింటన్ డీ కాక్ 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రవి బిష్ణోయి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా 8 పరుగులకే ఠాకూర్ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి ఔట్‌గా వెళ్లిపోయాడు. మర్‌క్రమ్ డకౌట్ అయ్యాడు. అయితే.. ఆ తర్వాత క్లాసెన్, డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడారు. వీళ్లిద్దరూ సౌతాఫ్రికా జట్టు స్కోర్‌లో కీలక పాత్ర పోషించారు. క్లస్సెన్ 65 బంతుల్లో 74 పరుగులు, మిల్లర్ 63 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు 2 వికెట్లు, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది.

Updated Date - 2022-10-07T00:40:20+05:30 IST