India vs Australia: కేమరన్ గ్రీన్ విశ్వరూపం.. భారత బౌలర్లను బాదిపడేసిన ఆసీస్ ఓపెనర్

ABN , First Publish Date - 2022-09-26T01:01:31+05:30 IST

భారత్‌లో ఇక్కడ జరుగుతున్న చివరి టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ కేమరన్ గ్రీన్ విశ్వరూపం ప్రదర్శించాడు. 19 బంతుల్లోనే 7 ఫోర్లు

India vs Australia: కేమరన్ గ్రీన్ విశ్వరూపం.. భారత బౌలర్లను బాదిపడేసిన ఆసీస్ ఓపెనర్

హైదరాబాద్: భారత్‌లో ఇక్కడ జరుగుతున్న చివరి టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ కేమరన్ గ్రీన్ విశ్వరూపం ప్రదర్శించాడు. 19 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) పూర్తి చేసుకుని స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, ఎట్టకేలకు అతడి వీర విహారానికి భువనేశ్వర్ కుమార్ తెరదించాడు. ఐదో ఓవర్ చివరి బంతికి గ్రీన్‌ను పెవిలియన్ పంపాడు. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొన్న గ్రీన్ 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.


గ్రీన్ వీరబాదుడుతో ఆస్ట్రేలియా 5 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. అంతకుముందు మరో ఓపెనర్ అరోన్ ఫించ్‌ (7)ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన గ్రీన్‌.. భారత్‌పై టీ20ల్లో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాదు, నాలుగో ఆస్ట్రేలియన్‌గానూ చరిత్ర సృష్టించాడు. అతడి కంటే ముందు జాన్సన్ చార్లెస్ 2016లో 20 బంతుల్లో, 2009లో కుమార సంగక్కర 21 బంతుల్లో భారత్‌పై అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించారు.

Updated Date - 2022-09-26T01:01:31+05:30 IST