భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన దక్షిణాఫ్రికా

ABN , First Publish Date - 2022-01-23T23:59:48+05:30 IST

భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. సఫారీల జోరు చూసి ఇండియా ఎదుట

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన దక్షిణాఫ్రికా

కేప్‌టౌన్: భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. సఫారీల జోరు చూసి ఇండియా ఎదుట కొండంత లక్ష్యం ఉంటుందని భావించారు. అయితే, చివర్లో భారత బౌలర్లు విజృంభించడంతో చివరి వరుస వికెట్లు టపటపా నేలరాలాయి. ఫలితంగా దక్షిణాఫ్రికా మరో బంతి మిగిలి ఉండగానే 287 పరుగులకు ఆలౌట్ అయింది. 


సఫారీ బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో (124) చెలరేగగా, వాండెర్ డుసెన్ (52) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. డేవిడ్ మిల్లర్ 39, ప్రిటోరియస్ 20 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ మూడు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. యుజ్వేంద్ర చాహల్‌కు ఓ వికెట్ లభించింది.

Read more