నాకౌట్‌కు భారత్‌

ABN , First Publish Date - 2022-10-04T09:03:20+05:30 IST

కామన్వెల్త్‌ పతక విజేత శ్రీజ అదరగొట్టడంతో.. భారత మహిళల జట్టు వరల్డ్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.

నాకౌట్‌కు భారత్‌

వరల్డ్‌ టీటీ చాంపియన్‌షిప్

చెంగ్డూ: కామన్వెల్త్‌ పతక విజేత శ్రీజ అదరగొట్టడంతో.. భారత మహిళల జట్టు వరల్డ్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-1తో ఈజిప్ట్‌పై గెలిచింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ 11-6, 11-4, 11-1తో గొడా హన్‌పై, రెండో మ్యాచ్‌లో 11-8, 11-8, 11-6తో దినా మిష్రఫ్‌పై గెలిచింది. మనికా బాత్రా 8-11, 11-6, 11-7, 2-11, 11-8తో దినాపై చెమటోడ్చి నెగ్గింది. దివ్య చిటాలే ఓటమిపాలైంది.


కాగా, పురుషుల జట్టు నాకౌట్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి. గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-2తో కజకిస్థాన్‌పై గెలిచింది. తొలి మ్యాచ్‌లో సాథియన్‌ 11-1, 11-9, 11-5తో జొలుడెవ్‌పై నెగ్గినా.. మరో మ్యాచ్‌లో కిరిల్‌ చేతిలో 11-6, 5-11, 14-12, 9-11, 6-11తో ఓడాడు. హర్మీత్‌ 6-11, 8-11, 9-11తో కిరిల్‌ చేతిలో ఓడినా.. మానవ్‌ 12-10, 11-1, 11-8తో అలన్‌పై గెలిచాడు. నిర్ణాయక మ్యాచ్‌లో హర్మీత్‌ 12-10, 11-9, 11-6తో డెనిపై నెగ్గి భారత్‌కు విజయాన్నందించాడు. 

Read more