పాక్‌తో భారత్‌ తొలి పోరు

ABN , First Publish Date - 2022-10-04T09:01:31+05:30 IST

వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగే మహిళల టీ20 ప్రపంచ క్‌పలో భారత్‌ తన పోరును పాకిస్థాన్‌తో ప్రారంభించనుంది.

పాక్‌తో భారత్‌ తొలి పోరు

మహిళల టీ20 ప్రపంచ కప్‌

దుబాయ్‌: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగే మహిళల టీ20 ప్రపంచ క్‌పలో భారత్‌ తన పోరును పాకిస్థాన్‌తో ప్రారంభించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌ షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, క్వాలిఫయర్‌ ఐర్లాండ్‌తో కలిసి భారత్‌కు గ్రూప్‌-2లో చోటు దక్కింది. ఫిబ్రవరి 12న పాక్‌తో తొలి మ్యాచ్‌ ఆడనున్న హర్మన్‌ప్రీత్‌ సేన.. 15న విండీ్‌సతో, 18న ఇంగ్లండ్‌, 20న ఐర్లాండ్‌ జట్లతో తలపడనుంది. 10న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో శ్రీలంక ఆడనుంది. డిఫెండింగ్‌ చాంప్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ గ్రూప్‌-1 నుంచి బరిలోకి దిగనున్నాయి.  

Read more