తొలి ఇన్నింగ్స్‌లో చతికిలపడిన భారత్.. 202 పరుగులకు ఆలౌట్

ABN , First Publish Date - 2022-01-04T01:44:07+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్

తొలి ఇన్నింగ్స్‌లో చతికిలపడిన భారత్.. 202 పరుగులకు ఆలౌట్

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ కేఎల్ రాహుల్ సమయోచితంగా ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ ఆ వెంటనే అవుటయ్యాడు. 


మయాంక్ అగర్వాల్ (26) పుజారా (3), రహానే (0),  హనుమ విహారి (20), పంత్ (17) దారుణంగా విఫలమయ్యారు. షమీ 9, బుమ్రా 14, సిరాజ్ ఒక పరుగు చేశారు. ఇక రవిచంద్రన్ అశ్విన్ మాత్రం సఫారీ బౌలర్లను ఎదురొడ్డి 46 పరుగులు చేసి జట్టు స్కోరు 200 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించాడు.  సఫారీ బౌలర్లలో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, రబడ, ఒలీవర్ 3 వికెట్లు తీసుకున్నారు. 

Read more