ఓదార్పు విజయం కోసం..

ABN , First Publish Date - 2022-12-10T02:17:57+05:30 IST

మూడు వన్డేల సిరీ్‌సలో వరుసగా రెండు పరాజయాలు.. ఇక చివరి మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌ రోహిత్‌తో పాటు..

ఓదార్పు విజయం కోసం..

ఉ. 11.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

వైట్‌వాష్‌ అంచున భారత్‌

నేడు బంగ్లాదేశ్‌తో చివరి వన్డే

చిట్టగాంగ్‌: మూడు వన్డేల సిరీ్‌సలో వరుసగా రెండు పరాజయాలు.. ఇక చివరి మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌ రోహిత్‌తో పాటు పేసర్లు దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ సేన్‌ గాయాలతో అందుబాటులో లేకుండా పోయారు. ఈనేపథ్యంలో శనివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ఓదార్పు విజయమైనా దక్కించుకుంటుందా? లేక వైట్‌వా్‌షకు గురవుతుందా? అని వేచిచూడాల్సిందే.

కూర్పు ఎలా?: కీలక ఆటగాళ్లకు గాయాలతో పాటు ఫిట్‌నెస్‌ లోపాలతో టీమిండియా సతమతమవుతోంది. రోహిత్‌ ఈ టూర్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ లేక రాహుల్‌లలో ఒకరిని ఎంపిక చేస్తారా? లేక విరాట్‌, ధవన్‌తోనే ముందుకు సాగుతారా? వేచిచూడాలి. ఇక బౌలర్లు దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ సేన్‌ గాయాలతో దూరమవడంతో లెగ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఈ వన్డే కోసం ఎంపిక చేశారు.

భారత్‌: ధవన్‌, ఇషాన్‌, విరాట్‌, శ్రేయాస్‌, రాహుల్‌ (కెప్టెన్‌), సుందర్‌, అక్షర్‌, శార్దూల్‌, షాబాజ్‌/కుల్దీప్‌ యాదవ్‌, సిరాజ్‌, ఉమ్రాన్‌.

బంగ్లాదేశ్‌: లిట్టన్‌ దాస్‌ (కెప్టెన్‌), అనముల్‌, షంటో, షకీబల్‌, ముష్ఫికర్‌, మహ్ముదుల్లా, ఆఫిఫ్‌, మెహిదీ హసన్‌, నసూమ్‌, ముస్తాఫిజుర్‌, ఎబాదత్‌.

Updated Date - 2022-12-10T02:18:36+05:30 IST