Virat Kohli: నా కంటే కోహ్లీనే గొప్పోడు: సౌరవ్ గంగూలీ

ABN , First Publish Date - 2022-09-10T22:28:28+05:30 IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(virat kohli) ఒకే ఒక్క సెంచరీతో మూడేళ్ల పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు

Virat Kohli: నా కంటే కోహ్లీనే గొప్పోడు: సౌరవ్ గంగూలీ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(virat kohli) ఒకే ఒక్క సెంచరీతో మూడేళ్ల పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. కోహ్లీ పని ఇక అయిపోయిందని, క్రికెట్ నుంచి తప్పుకోవడం బెటరని సలహాలు ఇచ్చిన వారి నోళ్లను ఒక్క శతకంతో మూయించాడు. ఆసియాకప్‌(asia cup)లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి మునుపటి కోహ్లీని గుర్తు చేశాడు. 2019 తర్వాత కోహ్లీకి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ.


ఈ శతకం తర్వాత 33 ఏళ్ల టీమిండియా రన్ మెషీన్‌పై మళ్లీ ప్రశంసల వర్షం కురిసింది. అప్పటి వరకు ఉన్న విమర్శలన్నీ మటుమాయమైపోయాయి. బీసీసీఐ సారథి, టీమిండియా మాజీ స్కిప్పర్ సౌరవ్ గంగూలీ(sourav ganguly) తాజాగా కోహ్లీని కొనియాడాడు. ఓ ఆటగాడిగా తన కంటే కోహ్లీనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాడని ప్రశంసించాడు. భారత్‌కు కోహ్లీ ప్రాతినిధ్యం కొనసాగుతూనే ఉంటుందని, తనకంటే సుదీర్ఘంగా ఆడతాడని జోస్యం చెప్పాడు. 


 కోహ్లీకి గంగూలీ అండగా నిలవడం ఇదే తొలిసారి కాదు. ఆసియాకప్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. కోహ్లీ గొప్ప ఆటగాడిగా అభివర్ణించాడు. ఈ టోర్నీలో అతడు ఫామ్‌లోకి వస్తాడని జోస్యం చెప్పాడు. అన్నట్టుగా రెండు అర్ధ సెంచరీలు, సెంచరీలతో చెలరేగి తిరిగి ఫామ్‌ను సొంతం చేసుకున్నాడు. 

Updated Date - 2022-09-10T22:28:28+05:30 IST