పంజాబ్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి

ABN , First Publish Date - 2022-10-12T09:07:16+05:30 IST

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని హైదరాబాద్‌ ఓటమితో ఆరంభించింది. మంగళవారం గ్రూప్‌-బిలోని పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 59 పరుగుల తేడాతో..

పంజాబ్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి

జైపూర్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని హైదరాబాద్‌ ఓటమితో ఆరంభించింది. మంగళవారం గ్రూప్‌-బిలోని పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌.. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (50), సన్వీర్‌ సింగ్‌ (55 నాటౌట్‌) అదరగొట్టడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. రక్షణ్‌ 2, పున్నయ్య, రవితేజ చెరో వికెట్‌ తీశారు. ఛేదనలో హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. తిలక్‌ వర్మ (50) ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు. బాల్‌తేజ, అభిషేక్‌ చెరో 3 వికెట్లు తీశారు. ఇక, గ్రూప్‌-డిలోని ఆంధ్ర-సౌరాష్ట్ర మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో రెండు పాయింట్లు కేటాయించారు.

Read more