ఆసియా చాంపియన్‌షిప్‌కు హుస్సాముద్దీన్‌

ABN , First Publish Date - 2022-09-19T09:40:36+05:30 IST

వచ్చే నెలలో జోర్డాన్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు తెలుగు బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ అర్హత సాధించాడు.

ఆసియా చాంపియన్‌షిప్‌కు హుస్సాముద్దీన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వచ్చే నెలలో జోర్డాన్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు తెలుగు బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ అర్హత సాధించాడు.  సెలెక్షన్‌ ట్రయల్స్‌లో పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్‌లో హుస్సామ్‌ 6-1తో కల్వీందర్‌ బిస్త్‌ను ఓడించి ఆసియా బెర్త్‌ దక్కించుకున్నాడు. హుస్సామ్‌, శివ థాపా, సుమిత్‌, సచిన్‌, అమిత్‌తో పాటు మొత్తం 13 మంది భారత బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు.

Read more