పబ్‌లో పాలు తెమ్మన్నాడు..

ABN , First Publish Date - 2022-11-25T03:20:06+05:30 IST

ఏ క్రీడలోనైనా సహచరుల మధ్య మైదానం వెలుపల సరదా విషయాలు ఎన్నో చోటు చేసుకుంటుంటాయి. అలాంటి మధుర జ్ఞాపకాలను కొన్నేళ్ల తర్వాత

పబ్‌లో పాలు తెమ్మన్నాడు..

కరాచీ: ఏ క్రీడలోనైనా సహచరుల మధ్య మైదానం వెలుపల సరదా విషయాలు ఎన్నో చోటు చేసుకుంటుంటాయి. అలాంటి మధుర జ్ఞాపకాలను కొన్నేళ్ల తర్వాత గుర్తుకు తెచ్చుకుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఓసారి నైట్‌క్లబ్‌ కెళ్లి చేసిన పని గురించి దిగ్గజ పేసర్‌ వసీం అక్రమ్‌ పంచుకున్నాడు. ‘నేను యువ ఆటగాడిగా ఉన్నప్పుడు ఇమ్రాన్‌తో కలిసి లండన్‌లోని నైట్‌క్లబ్‌కు వెళ్లాం. వాస్తవానికి తను మద్యం ముట్టుకోడు. అయితే అక్కడికి వెళ్లాక కేవలం పాలు కావాలని మాత్రమే ఆర్డర్‌ చేశాడు. నైట్‌క్లబ్‌కు వచ్చి పాలు తాగడం మాత్రం నాకు విచిత్రంగా అనిపించింది. ఇక అక్కడున్న అమ్మాయిలంతా ఇమ్రాన్‌తో కరచాలనం చేసేందుకు క్యూ కట్టారు’ అని వసీం వివరించాడు.

Updated Date - 2022-11-25T10:33:11+05:30 IST

Read more