ఐర్లాండ్‌ కెప్టెన్సీని వద్దన్నాడు!

ABN , First Publish Date - 2022-12-13T03:27:17+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఐర్లాండ్‌ క్రికెట్‌ అధ్యక్షుడు డేవిడ్‌ గ్రిఫిన్‌..వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను

ఐర్లాండ్‌ కెప్టెన్సీని వద్దన్నాడు!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఐర్లాండ్‌ క్రికెట్‌ అధ్యక్షుడు డేవిడ్‌ గ్రిఫిన్‌..వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను కోరాడట. అంతేకాదు..తనను ఐర్లాండ్‌ జాతీయ జట్టు కెప్టెన్‌గా కూడా చేస్తామని ప్రతిపాదించినట్టు సంజూ ఓ వెబ్‌సైట్‌కు చెప్పాడు. కానీ ఈ ఆఫర్‌ను సంజూ సున్నితంగా తిరస్కరించాడు. ‘మీ ప్రతిపాదనకు థ్యాంక్స్‌. భారత్‌కు ఆడాలన్న లక్ష్యంతోనే నేను క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభించా. మా సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్నా. నాకు మరే జట్టుకూ ప్రాతినిధ్యం వహించాలన్న ఆలోచనే లేదు. టీమిండియా తరపున నాకు తగినన్ని అవకాశాలు లభించి ఉండకపోవచ్చు. కానీ మరింతగా శ్రమించి జట్టులో చోటు సంపాదిస్తా’ అని శాంసన్‌ బదులిచ్చాడట.

Updated Date - 2022-12-13T03:27:17+05:30 IST

Read more