టాప్‌ - 5లో హర్మన్‌ప్రీత్‌

ABN , First Publish Date - 2022-09-28T09:45:01+05:30 IST

ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో అదరగొట్టే ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌..

టాప్‌ - 5లో హర్మన్‌ప్రీత్‌

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో అదరగొట్టే ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లోకి దూసుకెళ్లింది. మంగళవారం విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ బ్యాటర్స్‌ విభాగంలో హర్మన్‌ 5వ స్థానంలో నిలిచింది. ఓపెనర్‌ స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌లో, దీప్తి శర్మ 24వ స్థానం దక్కించుకున్నారు. బౌలర్లలో జులన్‌ గోస్వామి 5వ ర్యాంక్‌తో రిటైర్‌ కాగా.. రేణుక సింగ్‌ 35వ స్థానం సాధించింది. 

Read more