హర్మన్‌ సేన జోరు సాగాలని..

ABN , First Publish Date - 2022-10-03T09:28:20+05:30 IST

తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న హర్మన్‌ప్రీత్‌ సేన..ఆసియా కప్‌లో.

హర్మన్‌ సేన జోరు సాగాలని..

సిల్హెట్‌: తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న హర్మన్‌ప్రీత్‌ సేన..ఆసియా కప్‌లో సోమవారం జరిగే పోరులో అంతగా పేరులేని మలేసియాను ఢీకొననుంది. ఈ పోరు భారత్‌కు నెట్‌ ప్రాక్టీస్‌ లాంటిదనే చెప్పాలి. మరి సుదీర్ఘకాల ఫామ్‌లేమికి ఓపెనర్‌ షఫాలీ ఈ మ్యాచ్‌తోనైనా ఫుల్‌స్టాప్‌ పెడుతుందేమో చూడాలి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లలో పాకిస్థాన్‌ 9 వికెట్లతో మలేసియాపై, శ్రీలంక 11 పరుగులతో (డ/లూ) యూఏఈపై గెలిచాయి. 

Read more