గ్రూప్‌ టాపర్‌ నెదర్లాండ్స్‌

ABN , First Publish Date - 2022-11-30T02:08:20+05:30 IST

ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను ఓటమి లేకుండా ముగించిన నెదర్లాండ్స్‌ గ్రూప్‌- ఎలో టాపర్‌గా నిలిచింది. దీంతో ఏడు పాయింట్లతో ఉన్న ఈ జట్టు నాకౌట్‌లోకి ప్రవేశించింది.

గ్రూప్‌ టాపర్‌ నెదర్లాండ్స్‌

ఖతార్‌పై గెలుపు

దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను ఓటమి లేకుండా ముగించిన నెదర్లాండ్స్‌ గ్రూప్‌- ఎలో టాపర్‌గా నిలిచింది. దీంతో ఏడు పాయింట్లతో ఉన్న ఈ జట్టు నాకౌట్‌లోకి ప్రవేశించింది. మంగళవారం ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో డచ్‌ జట్టు 2-0తో ఘనవిజయం సాధించింది. ఇక వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఖతార్‌.. సున్నా పాయింట్లతో గ్రూప్‌ దశను ముగించిన తొలి ఆతిథ్య జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరల్డ్‌కప్‌ల్లో ఆడిన గత పది మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌కి ఓటమిలేదు. కాగా ప్రథమార్ధం 26వ నిమిషంలో గాక్పో జట్టుకు తొలి గోల్‌ అందించి ఆధిక్యంలో నిలిపాడు. ఈ టోర్నీలో అతనికి మూడో గోల్‌. డావీ క్లాసెన్‌ నుంచి అందుకున్న పాస్‌ను గాక్పో తక్కువ ఎత్తులో బాటమ్‌ కార్నర్‌ ద్వారా నెట్‌లోకి పంపాడు. ఇక ద్వితీయార్ధం ఆరంభమైన మూడో నిమిషంలోనే ఫ్రెంకీ డి జోంగ్‌ చేసిన రెండో గోల్‌తో డచ్‌ జట్టు పూర్తి ఆధిక్యంలోకి వెళ్లింది. 69వ నిమిషంలో బెర్గూయిస్‌ మరో గోల్‌ సాధించినా అది గాక్పో చేతికి తాకడంతో ఫౌల్‌ అయ్యింది. 73వ నిమిషంలోనూ మరో చాన్స్‌ లభించినా ఖతార్‌ గోల్‌ కీపర్‌ వమ్ము చేశాడు.

Updated Date - 2022-11-30T02:08:20+05:30 IST

Read more