ఖో-ఖో లీగ్‌లో తెలుగు ఫ్రాంచైజీని దక్కించుకున్న జీఎంఆర్‌

ABN , First Publish Date - 2022-06-07T10:02:49+05:30 IST

అల్టిమేట్‌ ఖో-ఖో లీగ్‌లో తెలుగు రాష్ట్రాల ఫ్రాంచైజీని జీఎంఆర్‌ సంస్థ కొనుగోలు చేసింది.

ఖో-ఖో లీగ్‌లో తెలుగు ఫ్రాంచైజీని దక్కించుకున్న జీఎంఆర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అల్టిమేట్‌ ఖో-ఖో లీగ్‌లో తెలుగు రాష్ట్రాల ఫ్రాంచైజీని జీఎంఆర్‌ సంస్థ కొనుగోలు చేసింది. జీఎంఆర్‌తో పాటు మరో కార్పొరేట్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ ఈ లీగ్‌లోని గుజరాత్‌ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. డాబర్‌ గ్రూప్‌ చైర్మన్‌ అమిత్‌ బర్మాన్‌తో కలిసి ఖో-ఖో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కేకేఎఫ్‌ఐ) ఈ లీగ్‌కు శ్రీకారం చుట్టింది. దేశీయ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖో-ఖో లీగ్‌లోని తెలుగు జట్టును దక్కించుకున్నామని జీఎంఆర్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ చైర్మన్‌ గ్రంధి కిరణ్‌ కుమార్‌ తెలిపారు. కబడ్డీ, రెజ్లింగ్‌ వంటి దేశీయ క్రీడల అభివృద్ధికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నామని.. ఇదే ఉద్దేశంతో గ్రామీణ క్రీడైన ఖో-ఖో వృద్ద్ధికి ఇక నుంచి సహకారమందిస్తామని కిరణ్‌ చెప్పారు. ఫ్రాంచైజీ పేర్లు, లీగ్‌ షెడ్యూల్‌ ఖరారు కావాల్సి ఉంది. పోటీల ప్రత్యక్షప్రసారాలకు సోనీ నెట్‌వర్క్‌తో లీగ్‌ నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు.

Updated Date - 2022-06-07T10:02:49+05:30 IST