ప్రమాదంలో మాజీ అంపైర్‌ మృతి

ABN , First Publish Date - 2022-08-10T05:52:48+05:30 IST

‘స్లో ఫింగర్‌ ఆఫ్‌ డెత్‌’గా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా మాజీ అంపైర్‌ రూడీ కొయెట్జన్‌ (73) కారు ప్రమాదంలో మృతి చెందాడు.

ప్రమాదంలో మాజీ అంపైర్‌ మృతి

జొహాన్నె్‌సబర్గ్‌: ‘స్లో ఫింగర్‌ ఆఫ్‌ డెత్‌’గా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా మాజీ అంపైర్‌ రూడీ కొయెట్జన్‌ (73) కారు ప్రమాదంలో మృతి చెందాడు. స్నేహితులతో కలసి గోల్ఫ్‌ టోర్నీ ఆడేందుకు వెళ్లిన రూడీ.. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఐసీసీ ఎలిట్‌ ప్యానెల్‌ అంపైర్‌గా ఎనిమిదేళ్లపాటు సేవలందించిన కొయెట్జన్‌.. 331 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశాడు. 1992-93లో దక్షిణాఫ్రికాలో భారత్‌ పర్యటనలో పోర్ట్‌ ఎలిజబెత్‌ వన్డేతో అరంగేట్రం చేసిన రూడీ.. 2010లో రిటైరయ్యాడు. ఆటగాడు అవుటైనప్పుడు నెమ్మదిగా వేలికి పైకి లేపుతుండడంతో అతడిని ‘స్లో ఫింగర్‌ ఆఫ్‌ డెత్‌’గా పిలిచేవారు. అది తన ట్రేడ్‌ మార్క్‌ అని ఒకానొక సందర్భంలో కొయెట్జన్‌ చెప్పాడు. 

Read more