భారతీయులుగా గర్వించండి: పీటర్సన్‌

ABN , First Publish Date - 2022-08-16T10:18:30+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు వివిధ దేశాల మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు.

భారతీయులుగా గర్వించండి: పీటర్సన్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు వివిధ దేశాల మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌కు కామెంటేటర్‌గా భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఈనేపథ్యంలో అతడు చేసిన ట్వీట్‌ దేశ ప్రజల హృదయాలను తాకింది. ‘75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు. భారతీయులైనందుకు గర్వించండి. మరింత ఎత్తుకు ఎదిగేందుకు ప్రయత్నించండి. మెరుగైన భారత్‌ నిర్మాణంలో మీరు భాగస్వాములు’ అని కెవిన్‌ ట్వీట్‌ చేశాడు.

Read more