ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు వార్నర్‌, కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ దూరం?

ABN , First Publish Date - 2022-02-23T09:08:07+05:30 IST

పాకిస్థాన్‌ టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉన్నా కూడా.. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వార్నర్‌, హాజెల్‌వుడ్‌, కమిన్స్‌ దూరం కానున్నారు.

ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు   వార్నర్‌, కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ దూరం?

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉన్నా కూడా.. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వార్నర్‌, హాజెల్‌వుడ్‌, కమిన్స్‌ దూరం కానున్నారు. వచ్చేనెల నాలుగున టెస్ట్‌ సిరీస్‌తో మొదలయ్యే పాక్‌ పర్యటన.. ఏప్రిల్‌ ఆరున ముగియనుంది. కాగా, ఐపీఎల్‌ వచ్చే నెలాఖరులో జరిగే చాన్సుంది. అయితే, టెస్ట్‌ సిరీస్‌ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్లు స్వదేశం వెళ్లాలని ఆసీస్‌ సెలెక్టర్లు ఆదేశించారు. ద్వైపాక్షిక సిరీస్‌ ముగిసిన తర్వాతనే ఐపీఎల్‌ ఆడేందుకు ఎన్‌ఓసీ ఇస్తామని ప్రకటించారు. దీంతో వార్నర్‌, కమిన్స్‌, హాజె ల్‌వుడ్‌ ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ల్లో ఆడకపోవచ్చు. 

Read more