హాకీ ఇండియా అధ్యక్షుడిగా దిలీప్‌ టిర్కీ ఏకగ్రీవం

ABN , First Publish Date - 2022-09-24T09:29:41+05:30 IST

హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడిగా భారత జట్టు మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

హాకీ ఇండియా అధ్యక్షుడిగా దిలీప్‌ టిర్కీ ఏకగ్రీవం

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడిగా భారత జట్టు మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. వాస్తవానికి హెచ్‌ఐ ఎన్నికలు వచ్చేనెల ఒకటిన జరగాల్సి ఉంది. అయితే ఏ పదవికీ పోటీ లేకపోవడంతో..ఎన్నికైన వారి వివరాలను శుక్రవారం ప్రకటించారు. అధ్యక్ష పదవికి యూపీ హాకీ చీఫ్‌ రాకేశ్‌ కత్యాల్‌, జార్ఖండ్‌నుంచి భోలానాథ్‌ సింగ్‌ వేసిన నామినేషన్లను ఉపసంహరించకున్నారు. ఫలితంగా టిర్కీ ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. భోలానాథ్‌ సెక్రటరీ జనరల్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అలాగే ఇతర కార్యవర్గం కూడా ఏకగ్రీవమైంది. 

Read more