సింగిల్ తీసి చాన్స్ ఇవ్వనా? సెంచరీ చేస్తావా?: David Warnerతో పావెల్ ఆసక్తికర సంభాషణ

ABN , First Publish Date - 2022-05-06T23:13:41+05:30 IST

Warner responds brilliantly when Powell asked if he wanted a single to get to 100 in 20th over

సింగిల్ తీసి చాన్స్ ఇవ్వనా? సెంచరీ చేస్తావా?: David Warnerతో పావెల్ ఆసక్తికర సంభాషణ

ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా క్రీజులో ఉన్న ఢిల్లీ కేపిటల్స్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్-రోవ్‌మన్ పావెల్ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ వెలుగులోకి వచ్చింది. మ్యాచ్ 20వ ఓవర్‌కు చేరుకుంది. వార్నర్ 90లలో ఉండగా, పావెల్ 40కిపైగా పరుగులు చేశాడు. ఆ ఓవర్‌లో స్ట్రైకింగ్‌లో ఉన్న పావెల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికే 92 పరుగులు చేసి ఉండడంతో చాన్స్ ఇస్తే సెంచరీ చేస్తాడని పావెల్ భావించాడు. ఆ వెంటనే అతడి వద్దకు వెళ్లి ‘‘నువ్వు సెంచరీ చేసుకుంటానంటే నేను సింగిల్ తీస్తాను’’ అన్నాడు. 


దానికి వార్నర్ ఇచ్చిన సమాధానం అతడిపై మరింత గౌరవాన్ని పెంచేలా చేసింది. పావెల్ అలా అడగ్గానే స్పందించిన వార్నర్.. ‘‘చూడు.. క్రికెట్ ఆడడం అలా కాదు. నువ్వు వీలైనంత వరకు ఆడేందుకు ప్రయత్నించు. నేనూ అదే చేశాను’’ అని చెప్పాడు. దీంతో వార్నర్ నాన్‌స్ట్రైకర్‌గానే ఉండిపోయాడు. 92 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. మ్యాచ్ అనంతరం తనకు, వార్నర్‌కు మధ్య జరిగిన సంభాషణను పావెల్ బయటపెట్టాడు.

Read more