ద్రవిడ్‌కు విశ్రాంతి.. కివీస్‌ టూర్‌ కోచ్‌ లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2022-11-12T03:12:20+05:30 IST

రాబోయే న్యూజిలాండ్‌ పర్యటనకు భారత జట్టు కోచ్‌గా జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ నియమితుడయ్యాడు.

ద్రవిడ్‌కు విశ్రాంతి.. కివీస్‌ టూర్‌ కోచ్‌ లక్ష్మణ్‌

అడిలైడ్‌: రాబోయే న్యూజిలాండ్‌ పర్యటనకు భారత జట్టు కోచ్‌గా జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ నియమితుడయ్యాడు. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇతర జట్టు సిబ్బందికి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో..కోచ్‌గా లక్ష్మణ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈనెల 18నుంచి జరిగే కివీస్‌ టూర్‌లో భాగంగా టీమిండియా మూడేసి టీ20లు, వన్డేలు ఆడనుంది. కెప్టెన్‌ రోహిత్‌తోపాటు, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, స్పిన్నర్‌ అశ్విన్‌కు న్యూజిలాండ్‌ పర్యటననుంచి విశ్రాంతి నిచ్చిన విషయం తెలిసిందే. ఇక..ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టీ20 జట్టుకు సారథిగా వ్యవహరించనుండగా, వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ వన్డే జట్టును నడిపించనున్నాడు. కాగా..రోహిత్‌ కెప్టెన్సీలోనే భారత జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల్లో బంగ్లాతో తలపడే ఈ జట్టులో ..కోహ్లీ, అశ్విన్‌ కూడా ఉంటారు. డిసెంబరు నాలుగున బంగ్లాదేశ్‌ టూర్‌ ప్రారంభం కానుంది.

Updated Date - 2022-11-12T03:12:20+05:30 IST

Read more