India New Zealand T20 series: సత్తా చూపుతారా?

ABN , First Publish Date - 2022-11-20T02:46:27+05:30 IST

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీ్‌సపై భారత యువ ఆటగాళ్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

India New Zealand T20 series: సత్తా చూపుతారా?

భారత యువ ఆటగాళ్లపై దృష్టి

నేడు కివీ్‌సతో రెండో టీ20

మధ్యాహ్నం 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌, డీడీ స్పోర్ట్స్‌లో

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీ్‌సపై భారత యువ ఆటగాళ్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీతొలి టీ20 వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో వీరికి నిరాశే ఎదురైంది. దీంతో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌ కీలకంగా మారనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడే చాన్సుంది.

తుది జట్టులో ఎవరో..?:

యువ ఆటగాళ్లతో నిండిన భారత జట్టులో ఎవరు బరిలోకి దిగనున్నారనేది ఆసక్తికరంగా మారింది. కుడి.. ఎడమ చేతి కాంబినేషన్‌ కోసం గిల్‌, ఇషాన్‌ ఓపెనర్లుగా రానున్నారు. ఆ తర్వాత సంజూ శాంసన్‌ వన్‌డౌన్‌లో రావొచ్చు. అయితే వికెట్‌ కీపర్‌ పంత్‌ను కూడా టాపార్డర్‌లో పంపే ఆలోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నట్టు సమాచారం. దీంతో నాలుగో నెంబర్‌లో ఆడే సూర్యకుమార్‌ను ఏ స్థానంలో దించుతారనేది చూడాలి. శ్రేయాస్‌, హుడాలను ఆడించాలనుకుంటే ఇషాన్‌ను తప్పించాల్సి ఉంటుంది. పేసర్‌ భువనేశ్వర్‌కు యువ బౌలర్ల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఒకవేళ భువీని ఆడిస్తే ఉమ్రాన్‌, సిరాజ్‌చాన్స్‌కు గండిపడినట్టవుతుంది. హర్షల్‌, అర్ష్‌దీప్‌ పేస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. స్పిన్నర్‌గా చాహల్‌ తుది జట్టులో ఉంటే.. మరో స్పిన్నర్‌ కోసం సుందర్‌, కుల్దీప్‌ మధ్య పోటీ ఉండనుంది.

కేన్‌పై ఒత్తిడి:

గప్టిల్‌పై వేటు పడడంతో ఓపెనర్‌గా ఫిల్‌ ఆలెన్‌పై కివీస్‌ జట్టుకు భారీఅంచనాలే ఉన్నాయి. కెప్టెన్‌ విలియమ్సన్‌కూ ఈ సిరీస్‌ కీలకమే. బ్యాటింగ్‌లో ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నాడు. ఈ ఫార్మాట్‌లో ఉండాల్సిన వేగం లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఇదే కారణంతో సన్‌రైజర్స్‌ కూడా అతడిని వదిలేసుకుంది. దీంతో ఐపీఎల్‌ వేలానికి ముందు బ్యాటింగ్‌లో తన సత్తా ఏమిటో చూపించాల్సిన అవసరమూ అతడిపై ఉంది. ఏదేమైనా స్వదేశీ అనుకూలతతో కివీస్‌ ఈ మ్యాచ్‌ గెలిచి సిరీ్‌సలో ముందంజ వేయాలనుకుంటోంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌:

గిల్‌, ఇషాన్‌, శాంసన్‌/శ్రేయా్‌స, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, సుందర్‌, భువనేశ్వర్‌, ఉమ్రాన్‌/హర్షల్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌.

న్యూజిలాండ్‌:

ఆలెన్‌, కాన్వే, విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, సోధీ, మిల్నే, ఫెర్గూసన్‌.

పిచ్‌, వాతావరణం:

ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండనుంది. దీంతో మ్యాచ్‌కు అంతరాయంతో పాటు పూర్తిగా రద్దయ్యే చాన్స్‌ లేకపోలేదు. ఇక్కడ జరిగిన అన్ని టీ20ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే నెగ్గాయి.

Updated Date - 2022-11-20T02:46:27+05:30 IST

Read more