Rohit and Tilak: సెంచరీలు బాదిన రోహిత్‌, తిలక్‌

ABN , First Publish Date - 2022-11-13T02:52:13+05:30 IST

రోహిత్‌ రాయుడు (156), తిలక్‌ వర్మ (132) శతకాలతో కదం తొక్కడంతో విజయ్‌ హజారే ట్రోఫీలో హిమాచల్‌ప్రదేశ్‌పై హైదరాబాద్‌ వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో నెగ్గింది.

Rohit and Tilak: సెంచరీలు బాదిన   రోహిత్‌, తిలక్‌

న్యూఢిల్లీ: రోహిత్‌ రాయుడు (156), తిలక్‌ వర్మ (132) శతకాలతో కదం తొక్కడంతో విజయ్‌ హజారే ట్రోఫీలో హిమాచల్‌ప్రదేశ్‌పై హైదరాబాద్‌ వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత హైదరాబాద్‌ 50 ఓవర్లలో 3 వికెట్లకు 360 పరుగులు చేసింది. ఛేదనలో హిమాచల్‌ జట్టులో అమిత్‌ కుమార్‌ (103), ప్రశాంత్‌ చోప్రా (73) సత్తా చాటారు. ఈ క్రమంలో వెలుతురు సరిగ్గా లేక ఆట 48వ ఓవర్‌ ముగిశాక మ్యాచ్‌ను నిలిపేశారు. అప్పటికి హిమాచల్‌ 9 వికెట్లు కోల్పోయి 335 పరుగులు చేయగా చేతిలో ఒక్క వికెట్‌ మాత్రమే ఉంది. మ్యాచ్‌ను కొనసాగించే అవకాశం లేకపోవడంతో వీజేడీ పద్ధతిలో హైదరాబాద్‌ను విజేతగా ప్రకటించారు. ఇక, ఆంధ్ర-గోవా మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.

Updated Date - 2022-11-13T02:52:14+05:30 IST