Australia : ఆసీస్‌దే సిరీస్‌

ABN , First Publish Date - 2022-11-20T02:47:35+05:30 IST

పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టు వన్డేల్లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా 72 పరుగులతో విజయం సాధించింది.

Australia : ఆసీస్‌దే సిరీస్‌

రెండో వన్డేలోనూ ఇంగ్లండ్‌ చిత్తు

సిడ్నీ: పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టు వన్డేల్లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా 72 పరుగులతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో దక్కించుకుంది. స్మిత్‌ (94), లబుషేన్‌ (58), మిచెల్‌ మార్ష్‌ (50) చెలరేగడంతో ముందుగా ఆసీస్‌ 50 ఓవర్లలో 280/8 స్కోరు చేసింది. భారీ ఛేదనలో ఇంగ్లండ్‌ 38.5 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. స్టార్క్‌ (4/47) జట్టు పతనాన్ని శాసించాడు. బిల్లింగ్స్‌ (71), విన్స్‌ (60) పోరాడినా ఇతర బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది.

Updated Date - 2022-11-20T02:47:51+05:30 IST