అజరుద్దీన్‌పై ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-10-11T09:03:33+05:30 IST

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజరుద్దీన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌కు హెచ్‌సీఏ మాజీ..

అజరుద్దీన్‌పై ఫిర్యాదు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజరుద్దీన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌కు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్‌, మాజీ సెక్రటరీ శే్‌షనారాయణ్‌, మాజీ ఈసీ సభ్యుడు చిట్టి శ్రీధర్‌  ఫిర్యాదు చేశారు. అజర్‌ పదవీకాలం గతనెల 26నే ముగిసినా.. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అతను ఇంకా పదవిలో కొనసాగుతున్నాడని వారు ఫిర్యాదు చేశారు. ఈనెల 18న జరిగే బీసీసీఐ ఏజీఎంలో హెచ్‌సీఏ తరఫున అతను హాజరుకావడం నిబంఽధనలకు విరుద్దమని వారు పేర్కొన్నారు.

Read more