కామెరూన్‌, సెర్బియా ఉత్కంఠ డ్రా

ABN , First Publish Date - 2022-11-29T01:05:00+05:30 IST

సబ్‌స్టిట్యూట్‌ విన్సెంట్‌ అబూబాకర్‌ అదరగొట్టడంతో..ఓటమి అంచున నిలిచిన కామెరూన్‌ సోమవారంనాటి గ్రూప్‌ ‘జి’ మ్యాచ్‌ను సెర్బియాతో 3-3తో సంచలన రీతిలో డ్రా చేసింది.

కామెరూన్‌, సెర్బియా ఉత్కంఠ డ్రా

కామెరూన్‌, సెర్బియా ఉత్కంఠ డ్రా

అల్‌ వఖ్రా (ఖతార్‌): సబ్‌స్టిట్యూట్‌ విన్సెంట్‌ అబూబాకర్‌ అదరగొట్టడంతో..ఓటమి అంచున నిలిచిన కామెరూన్‌ సోమవారంనాటి గ్రూప్‌ ‘జి’ మ్యాచ్‌ను సెర్బియాతో 3-3తో సంచలన రీతిలో డ్రా చేసింది. క్యాస్టెలెటో (29), అబూబాకర్‌ (63), మోటింగ్‌ (66) కామెరూన్‌కు గోల్స్‌ సాధించారు. పవ్లోవిక్‌ (45+1), మిలిన్కోవిక్‌ (45+3), మిట్రోవిక్‌ (53) సెర్బియా తరపున గోల్స్‌ చేశారు. 29వ నిమిషంలో క్యాస్టెలెటో చేసిన గోల్‌తో కామెరూన్‌ ముందంజలో నిలిచింది. ప్రథమార్థం అదనపు సమయంలో రెండు నిమిషాల తేడాతో పవ్లోవిక్‌, మిలిన్కోవిక్‌ గోల్స్‌ కొట్టడంతో విరామానికి సెర్బియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో మిట్రోవిక్‌ మెరవడంతో 3-1తో సెర్బియా తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ మూడు నిమిషాల వ్యవధిలో కామెరూన్‌ ఏకంగా రెండు గోల్స్‌ చేసి అత్యంత నాటకీయంగా మ్యాచ్‌కు ముగింపు పలికింది. అబూబాకర్‌ ఒక గోల్‌ చేయడమేకాదు..కామెరూన్‌ మరో గోల్‌ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.

Updated Date - 2022-11-29T01:05:01+05:30 IST