బుమ్రా వైద్య నివేదిక వచ్చాకే..

ABN , First Publish Date - 2022-10-02T09:34:59+05:30 IST

పేసర్‌ బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలకోసం ఎదురుచూస్తున్నట్టు కోచ్‌ ద్రవిడ్‌ తెలిపాడు.

బుమ్రా వైద్య నివేదిక వచ్చాకే..

గువాహటి: పేసర్‌ బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలకోసం ఎదురుచూస్తున్నట్టు కోచ్‌ ద్రవిడ్‌ తెలిపాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు ఈ స్టార్‌ పేసర్‌ దూరమైన విషయం తెలిసిందే. ‘బుమ్రా ఎన్‌సీఏలో ఉన్నాడు. అతడి గాయం తీవ్రత గురించి మాకింకా అధికారిక సమాచారం రాలేదు. అది వచ్చాకే బుమ్రా విషయంలో స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు మాత్రమే దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం. అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’ అని ద్రవిడ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Read more