Netherlands vs Pakistan: బాబర్ 91 పరుగులు చేసినా.. 206 పరుగులకే ఆలౌట్

ABN , First Publish Date - 2022-08-22T00:33:18+05:30 IST

నెదర్లాండ్స్‌(Netherlands)తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే (రీ షెడ్యూల్డ్ మ్యాచ్)లో పాకిస్థాన్(Pakistan) మరో

Netherlands vs Pakistan: బాబర్ 91 పరుగులు చేసినా.. 206 పరుగులకే ఆలౌట్

రోటర్‌డ్యామ్: నెదర్లాండ్స్‌(Netherlands)తో  ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే (రీ షెడ్యూల్డ్ మ్యాచ్)లో పాకిస్థాన్(Pakistan) మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 206 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రెండు వన్డేల్లోనూ పరాజయం పాలైన నెదర్లాండ్స్ ఈ మ్యాచ్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పాకిస్థాన్‌ను నిప్పుచెరిగే బంతులతో వణికించింది.


పాక్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) ఈ మ్యాచ్‌లో 91 పరుగులు చేసినప్పటికీ జట్టు మాత్రం 206 పరుగులకు ఆలౌట్ కావడం చూస్తుంటే నెదర్లాండ్స్ బౌలర్లు ఎంతలా చెలరేగిపోయారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 168 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా ఆజం అవుటైన తర్వాత మిగతా నాలుగు వికెట్లు టపటపా రాలిపోయాయి. ఫలితంగా 49.4 ఓవర్లలో 206 పరుగులకే పాకిస్థాన్ చాపచుట్టేసింది.


బాబర్ తర్వాత నవాజ్ చేసిన 27 పరుగులే పాక్ జట్టులో అత్యధికం కావడం గమనార్హం. నెదర్లాండ్స్ బౌలర్లలో బస్ డే లీడ్ 3 వికెట్లు తీసుకోగా కింగ్‌మా 2, ఆర్యన్ దత్, షరీజ్ అహ్మద్, వన్ బీక్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. అనంతరం 207 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. 

Read more