Australia: ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయం

ABN , First Publish Date - 2022-12-30T00:05:49+05:30 IST

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Australia: ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయం

2-0తో సిరీస్‌ కైవసం

మెల్‌బోర్న్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకొంది. అంతేకాకుండా 2005-06 తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాపై తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ దక్కించుకొంది. అయితే, బ్యాటర్ల వైఫల్యం కారణంగా ఘోర ఓటమిని చవిచూసిన సౌతాఫ్రికా వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆశలకు గట్టిదెబ్బ తగిలింది. రేసులో నిలవాలంటే వచ్చే నెల 4 నుంచి సిడ్నీలో జరిగే మూడో, ఆఖరి టెస్ట్‌లో సఫారీలు తప్పనిసరిగా నెగ్గాలి. ఆటకు నాలుగో రోజు 15/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌతాఫ్రికా 204 పరుగులకు కుప్పకూలింది. బవుమా (65) టాప్‌ స్కోరర్‌. లియాన్‌ 3, బొలాండర్‌ 2 వికెట్లు పడగొట్టారు. వార్నర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్రాఫ్రికా 189 రన్స్‌చేయగా.. ఆసీస్‌ 575/8 వద్ద డిక్లేర్‌ చేసింది. 2008-09, 2012-13, 2016-17లో జరిగిన ఆసీస్‌ పర్యటనల్లో దక్షిణాఫ్రికా సిరీస్‌లు నెగ్గింది.

Updated Date - 2022-12-30T00:05:51+05:30 IST