భారత్‌కు నిరాశ!

ABN , First Publish Date - 2022-05-24T09:35:07+05:30 IST

చిరకాల ప్రత్యర్థిపై విజయంతో ఆసియా కప్‌ను ఘనంగా ఆరంభించాలనుకున్న డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌కు నిరాశే ఎదురైంది.

భారత్‌కు నిరాశ!

ఆఖరి నిమిషంలో పాక్‌ గోల్‌

1-1తో మ్యాచ్‌ డ్రా 

ఆసియా కప్‌ హాకీ

జకర్తా: చిరకాల ప్రత్యర్థిపై విజయంతో ఆసియా కప్‌ను ఘనంగా ఆరంభించాలనుకున్న డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌కు నిరాశే ఎదురైంది. ఆఖరి నిమిషాల్లో డిఫెన్స్‌ అలసత్వంతో గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చెడగొట్టుకొంది. ఆసియా కప్‌ పూల్‌-ఎలో సోమవారం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. 9వ నిమిషంలో అరంగేట్ర ఆటగాడు కార్తి సెల్వం గోల్‌తో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సెల్వం ఫ్లిక్‌.. పాక్‌ డిఫెండర్‌ స్టిక్‌ను తాకి గోల్‌లో పడింది. కార్తికి ఇది తొలి అంతర్జాతీయ గోల్‌. అయితే, మరో నిమిషంలో (59వ) మ్యాచ్‌ ముగుస్తుందనగా అబ్దుల్‌ రాణా.. పెనాల్టీ కార్నర్‌ రీబౌండ్‌ను గోల్‌లోని నెట్టి స్కోరు సమం చేశాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ తలపడనుంది. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన భారత్‌.. పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. పాక్‌ గోల్‌ కీపర్‌ అక్మల్‌ హుస్సేన్‌ గోల్‌ పోస్టుకు అడ్డుగోడలా నిలిచాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్‌ కోసం దాడుల పరంపరను కొనసాగించినా సఫలం కాలేకపోయాయి. 

Updated Date - 2022-05-24T09:35:07+05:30 IST