Asia Cup Final: పాక్ బౌలింగ్‌కు శ్రీలంక విలవిల

ABN , First Publish Date - 2022-09-12T02:03:37+05:30 IST

ఆసియాకప్ సూపర్-4లో చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను వణికించిన శ్రీలంక ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్‌లో తడబడుతోంది

Asia Cup Final: పాక్ బౌలింగ్‌కు శ్రీలంక విలవిల

దుబాయ్: ఆసియాకప్ సూపర్-4లో చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను వణికించిన శ్రీలంక ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్‌లో తడబడుతోంది. పాక్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక తంటాలు పడుతోంది. నిప్పులు చెరుగుతూ దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోలేకపోతున్న శ్రీలంక 58 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హరీస్ రవూఫ్ రెండు వికెట్లు తీసి లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీయంగా నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిశాయి. శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. భానుక రాజపక్స (24), వనిందు హసరంగ(5) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-09-12T02:03:37+05:30 IST