Asia Cup 2022: ప్రతీకారం కోసం ఆఫ్ఘనిస్థాన్.. పై చేయి సాధించాలని శ్రీలంక

ABN , First Publish Date - 2022-08-28T00:52:03+05:30 IST

ఆసియా సమరానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్‌లో శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ కాలు దువ్వబోతున్నాయి. టాస్ గెలిచిన

Asia Cup 2022: ప్రతీకారం కోసం ఆఫ్ఘనిస్థాన్.. పై చేయి సాధించాలని శ్రీలంక

దుబాయ్: ఆసియా సమరానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్‌లో శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ కాలు దువ్వబోతున్నాయి. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్.. శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్‌పై ఉన్న మచ్చిక స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఆల్‌రౌండర్లు పుష్కలంగా ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.


2021 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌లో జరిగిన 13 మ్యాచుల్లో 12 గేముల్లో ఛేజింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఒకసారి ముఖాముఖి తలపడగా శ్రీలంక విజయం సాధించింది. ఇండియాలో 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ఆప్ఘనిస్థాన్ పట్టుదలగా ఉంది. కాగా, ఈ మ్యాచ్‌తో ఆఫ్ఘనిస్థాన్‌కు 100 టీ20 కావడం విశేషం.


శ్రీలంక జట్టు కూడా బలంగానే ఉంది. ఆ జట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రెండు కొత్త ముఖాలకు కూడా శ్రీలంక చోటు కల్పించింది. దిల్షాన్ మధుశంక, మతీషా పథిరన అరంగేట్రం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-28T00:52:03+05:30 IST