రాణించిన అరుంధతి, అంజలి

ABN , First Publish Date - 2022-11-25T03:16:53+05:30 IST

హైదరాబాదీ మీడియం పేసర్‌ అరుంధతి రెడ్డి (3/28) కీలక వికెట్లు పడగొట్టడంతో టీ20 చాలెంజర్‌ ట్రోఫీలో ఇండియా-సిపై

రాణించిన అరుంధతి, అంజలి

టీ20 చాలెంజర్‌ ట్రోఫీ

రాయ్‌పూర్‌: హైదరాబాదీ మీడియం పేసర్‌ అరుంధతి రెడ్డి (3/28) కీలక వికెట్లు పడగొట్టడంతో టీ20 చాలెంజర్‌ ట్రోఫీలో ఇండియా-సిపై ఇండియా-బి 4 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్‌ గెల్చిన ఇండియా-సి తొలుత 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సిమ్రన్‌ షేక్‌ (32), కెప్టెన్‌ పూజ (27), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (26) రాణించారు. ఛేదనలో దేవిక వైద్య (41 నాటౌట్‌) చెలరేగడంతో ఇండియా-బి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయం సాధించింది. అంతకుముందు ఇక్కడే జరిగిన మరో మ్యాచ్‌లో ఇండియా-డిపై ఇండియా-ఎ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆంధ్ర అమ్మాయి.. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అంజలి శర్వాణి (2/11) రెండు కీలక వికెట్లు తీసి సత్తా చాటింది.

Updated Date - 2022-11-25T03:16:53+05:30 IST

Read more