రేసింగ్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-12-10T00:40:35+05:30 IST

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరాన రయ్‌..రయ్‌...అంటూ రేసింగ్‌ కార్లు పరుగులు తీయడానికి రంగం సిద్ధమైంది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌

రేసింగ్‌కు సర్వం సిద్ధం

నేటి నుంచి ఐఆర్‌ఎల్‌ ఫైనల్‌ రౌండ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరాన రయ్‌..రయ్‌...అంటూ రేసింగ్‌ కార్లు పరుగులు తీయడానికి రంగం సిద్ధమైంది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)లో ఆఖరిదైన నాలుగో రౌండ్‌ శనివారం నుంచి రెండ్రోజుల పాటు జరగనుంది. ఆతిథ్య హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ టీమ్‌ అంతిమ సమరంలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు జరిగిన మూడు రౌండ్లలో మొదటిది రద్దు కాగా, చెన్నైలో జరిగిన రెండు రౌండ్లలో హైదరాబాద్‌ విజేతగా నిలవడం తెలిసిందే. ఫైనల్‌ రౌండ్‌లో హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగే నలుగురు డ్రైవర్ల బృందంలో అనిదిత్‌ రెడ్డి, లోఫెన్సా స్థానాల్లో విటాన్‌టొనియో లియుజి, గొసియా డెస్ట్‌ చేరారు. శనివారం మఽధ్యాహ్నం 3.10 గంటలకు క్వాలిఫయింగ్‌ రేస్‌-1, 3.30 గంటలకు క్వాలిఫయింగ్‌ రేస్‌-2, నాలుగు గంటలకు స్ర్పింట్‌ రేస్‌-1 జరగనుంది. ఆదివారం 12.15 గంటలకు స్ర్పింట్‌ రేస్‌-2, మధ్యాహ్నం 3.30 గంటలకు స్ర్పింట్‌ రేస్‌-3 మొదలు కానుంది. అనంతరం ట్రోఫీల ప్రదానోత్సవం, సాయంత్రం 6 నుంచి 8.30 గంటల వరకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌, శివమణిల సంగీత విభావరిని ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-12-10T00:40:36+05:30 IST