పోరాడుతున్న సౌరాష్ట్ర

ABN , First Publish Date - 2022-10-04T09:04:01+05:30 IST

రెస్టాఫ్‌ ఇండియా జట్టుతో ఇరానీ కప్‌ మ్యాచ్‌లో సౌరాష్ట్ర పోరాడుతోంది.

పోరాడుతున్న సౌరాష్ట్ర

 రెండో ఇన్నింగ్స్‌368/8 

‘రెస్ట్‌’తో ఇరానీ కప్‌

రాజ్‌కోట్‌: రెస్టాఫ్‌ ఇండియా జట్టుతో ఇరానీ కప్‌ మ్యాచ్‌లో సౌరాష్ట్ర పోరాడుతోంది. 227 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటుతో మూడోరోజైన  సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసేసరికి 368/8 స్కోరు చేసింది. షెల్డన్‌ జాక్సన్‌ (71), వసవద (55), ప్రేరక్‌ మన్కడ్‌ (72), జైదేవ్‌ ఉనాద్కట్‌ (78 బ్యాటింగ్‌) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో సౌరాష్ట్ర ఆధిక్యం 92 పరుగులకు చేరింది. కుల్దీప్‌ సేన్‌, సౌరభ్‌ కుమార్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98, రెస్టాఫ్‌ ఇండియా 374 పరుగులు సాధించాయి.  

Read more