విజేతకు రూ.13 కోట్లు

ABN , First Publish Date - 2022-10-01T10:00:46+05:30 IST

ఈనెల 16 నుంచి జరిగే పురుషుల టీ20 ప్రపంచక్‌ప ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది.

విజేతకు రూ.13 కోట్లు

టీ20 వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీ

దుబాయ్‌: ఈనెల 16 నుంచి జరిగే  పురుషుల టీ20 ప్రపంచక్‌ప ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది. విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 13 కోట్ల 2 లక్షలు) భారీ మొత్తం లభించనుంది. అలాగే ఫైనల్లో ఓడి రన్నర్‌పగా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.6 కోట్ల 50 లక్షలు) దక్కు తాయి. ఇక సెమీ్‌సలో తిరుగుముఖం పట్టే రెండు జట్లకు రూ.3 కోట్ల 25 లక్షల చొప్పున అందనున్నాయి. మరోవైపు సూపర్‌-12 దశలో ఒక్కో మ్యాచ్‌ గెలిచే జట్టుకు.. అంతకుముందు తొలి రౌండ్‌లో గెలిచే 12 జట్లకు కూడా రూ.33 లక్షల ప్రైజ్‌మనీ అందుతుంది. 

Read more