football match stampede: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెనువిషాదం.. తొక్కిసలాట జరిగి 127 మంది మృతి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-10-02T17:55:59+05:30 IST

ఇండోనేషియాలో(Indonesia) తీవ్ర విషాదకర ఘటన జరిగింది. ఈస్ట్ జావా ప్రావిన్స్‌లోని శనివారం రాత్రి జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌‌లో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది.

football match stampede: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెనువిషాదం.. తొక్కిసలాట జరిగి 127 మంది మృతి.. అసలేం జరిగిందంటే..

జకార్త: ఇండోనేషియాలో(Indonesia) తీవ్ర విషాదకర ఘటన జరిగింది. ఈస్ట్ జావా ప్రావిన్స్‌లోని శనివారం రాత్రి జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌‌లో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏకంగా 127 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 180 మంది గాయాలపాలయ్యారు. మలంగ్‌లోని  కంజురుహన్ (Kanjuruhan) స్టేడియంలో అమెరా ఎఫ్‌సీ, పెర్సెబయ సురబయ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ ఘటన జరిగింది. ఓటమిపాలైన జట్టు అమెరా ఎఫ్‌సీ అభిమానులు మ్యాచ్ జరిగిన పిచ్‌మీదకు దూసుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో అక్కడున్న పోలీసు బలగాలు భాష్పవాయుగోళాలను  ప్రయోగించాయి. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడం, టీయర్ గ్యాస్ ప్రభావంతో పలువురు ఊపిరి పీల్చుకోలేక మృత్యువాతపడ్డారని ఈస్ట్ జావా పోలీస్ చీఫ్ నికో అఫింటా మీడియాకు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై విచారణ మొదలుపెట్టామని తెలిపారు.  


కాగా ఈ దుర్ఘటన నేపథ్యంలో ఇండోనేసియా టాప్ లీగ్ ‘బీఆర్ఎల్ లీగా 1’ మ్యాచ్‌లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేసియా (PSSI) వెల్లడించింది. కాగా శనివారం రాత్రి జరిగిన పెర్సెబయ జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది. కాగా ఈ ఘటనకు సంబంధించి స్థానిక న్యూస్  ఛానళ్లు ప్రసారం చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  కాగా ఇండోనేసియాలో మ్యాచ్‌ల సమయంలో ఘర్షణలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ  ఈ తరహా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. క్లబ్ జట్ల మధ్య ప్రత్యర్థి జట్ల అభిమానులు పలుమార్లు ఘర్షణలకు పాల్పడ్డారు.



Updated Date - 2022-10-02T17:55:59+05:30 IST