-
-
Home » Prathyekam » Zomato Delivery Partner Carries His Kids To Work video gone viral sgr spl-MRGS-Prathyekam
-
Zomato Delivery Partner: ఇద్దరు పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్.. `రియల్ హీరో` అంటూ నెటిజన్ల ప్రశంసలు
ABN , First Publish Date - 2022-08-24T01:56:31+05:30 IST
జొమాటో, స్విగ్గీ వంటి సంస్థల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేసే వారి కథలు, వీడియోలు ఇటీవలి కాలంలో

జొమాటో, స్విగ్గీ వంటి సంస్థల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేసే వారి కథలు, వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. ఒక వ్యక్తి తన కూతురిని ఎత్తుకుని, కొడుకుని చేత పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆహారం అందిస్తున్నాడు. అతడి కథను saurabh panjwani అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
`ఆయనను చూడటం నాకు చాలా స్ఫూర్తి కలిగించింది. ఈ వ్యక్తి ఒక రోజంతా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎండలో ఫుడ్ డెలివరీలు చేశాడు. ఒక వ్యక్తి తలచుకుంటే ఏదైనా చేయగలడనే విషయాన్ని మనం నేర్చుకోవాలి` అని సౌరభ్ పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏకంగా 10 లక్షల వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై జొమాటో సంస్థ స్పందించింది. తమ ఉద్యోగుల కోసం రూపొందించిన చైల్డ్ కేర్ ప్రయోజనాలను అందించేందుకు ఆ డెలివరీ బాయ్ వివరాలను కోరింది.