అర్ధరాత్రి ప్రియుడిని ఇంటికి రమ్మన్న మహిళ.. అక్కడకు వెళ్లిన వ్యక్తికి ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-10-03T22:59:57+05:30 IST

వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు..

అర్ధరాత్రి ప్రియుడిని ఇంటికి రమ్మన్న మహిళ.. అక్కడకు వెళ్లిన వ్యక్తికి ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..

వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు.. వీలైనప్పుడల్లా కలిసి తిరిగేవారు.. అయితే యువతి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు.. ఆదివారం రాత్రి ఆ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచింది.. దీంతో యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు.. అక్కడ అతడికి షాకింగ్ అనుభవం ఎదురైంది.. తెల్లారేసరికి ఆ యువకుడు రోడ్డు పక్కన విగత జీవిగా పడి ఉన్నాడు.. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

రైలు పట్టాలపై కూర్చుని మాట్లాడుకుంటున్న స్నేహితులు.. రైలు రావడం చూసి కన్ఫ్యూజన్.. చివరకు..


ఖుషీ నగర్‌కు చెందిన 22 ఏళ్ల వికాస్ ప్రసాద్‌ తన పక్క గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీలైనప్పుడల్లా తరచుగా కలుసుకునేవారు. ఆదివారం రాత్రి ఇంటికి రమ్మని వికాస్‌ను ఆమె ప్రేయసి ఆహ్వానించింది. రాత్రి 10 గంటలకు వికాస్ ఆ యువతి ఇంటికి చేరుకున్నాడు. అయితే అనుకోకుండా తన ప్రేయసి సోదరుడు, మేనమామకు దొరికిపోయాడు. వారు వికాస్‌ను కర్రలతో చితక్కొట్టారు. తర్వాత కత్తితో పొడిచి చంపేశారు. 


వికాస్ మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. వికాస్ హత్య గురించి తెలుసుకున్న అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ విచారిస్తున్నారు.

Read more