‘ప్రేమ పేరుతో ఏడేళ్లుగా వెంట తిప్పుకుని ఇప్పుడు పెళ్లికి నో చెప్తోంది.. అందుకే కత్తితో దాడి చేశా..’

ABN , First Publish Date - 2022-12-12T18:44:18+05:30 IST

కుటుంబ సభ్యులు వెంటనే సునీతను ఆస్పత్రికి తరలించారు. విశాల్‌పై, అతడి స్నేహితుడిపై కత్తితో దాడి చేశారు. అనంతరం ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముందుగా విశాల్‌ను, అతడి ఇద్దరి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

‘ప్రేమ పేరుతో ఏడేళ్లుగా వెంట తిప్పుకుని ఇప్పుడు పెళ్లికి నో చెప్తోంది.. అందుకే కత్తితో దాడి చేశా..’

ఆ యువకుడు ఏడేళ్లుగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు.. ఆమె కూడా అతడితో ప్రేమ వ్యవహారం సాగించింది.. ఆమె కోసం అతడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు.. పెళ్లి విషయం వచ్చే సరికి ఆ యువతి మొహం చాటేసింది.. కారణం ఏదీ చెప్పకుండా పెళ్లికి నిరాకరించింది.. దీంతో యువకుడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.. ప్రియురాలు రైల్వే స్టేషన్‌కు వస్తోందని తెలుసుకుని కత్తి తీసుకుని అక్కడకు వెళ్లాడు.. స్టేషన్‌లో కుటుంబ సభ్యుల ఎదుటే ఆమెపై కత్తితో (Young man stabbed his girl friend) దాడి చేశాడు.. బీహార్‌లోని (Bihar) శివన్‌లో ఈ ఘటన జరిగింది.

బైకుంత్‌చాపర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల సునీతా కుమారి ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు తన బావను, అక్కను డ్రాప్ చేయడానికి తన కుటుంబంతో కలిసి మైర్వా రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడకు సునీత ప్రియుడు విశాల్‌సింగ్‌ తన స్నేహితులతో కలిసి వచ్చాడు. అందరి ఎదుట సునీత చేయి పట్టుకుని పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటని అడిగాడు. ఆమె కుటుంబ సభ్యులు విశాల్‌పై దాడికి ప్రయత్నించారు. దీంతో విశాల్ తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసి సునీతను (Bihar Crime News) పొడిచేశాడు. ఆ దాడిలో సునీత తీవ్రంగా గాయపడింది.

కుటుంబ సభ్యులు వెంటనే సునీతను ఆస్పత్రికి తరలించారు. విశాల్‌పై, అతడి స్నేహితుడిపై కత్తితో దాడి చేశారు. అనంతరం ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముందుగా విశాల్‌ను, అతడి ఇద్దరి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Updated Date - 2022-12-12T18:44:18+05:30 IST

Read more