జగన్ రెడ్డీ... తల్లినీ, చెల్లినీ పొడిచిన వెన్నుపోట్లు ప్రజలకు తెలియదా?

ABN , First Publish Date - 2022-07-10T01:16:32+05:30 IST

వైసీపీ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు జరిగాయి. అయితే ఈ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా..

జగన్ రెడ్డీ... తల్లినీ, చెల్లినీ పొడిచిన వెన్నుపోట్లు ప్రజలకు తెలియదా?

అమరావతి/హైదరాబాద్: వైసీపీ ప్లీనరీ (Ycp Plenary) సమావేశాలు రెండు రోజుల పాటు జరిగాయి. అయితే ఈ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  (Ap Cm Jagan Mohanreddy) సహా పలువురు వైసీపీ నేతలు.. సంక్షేమ పథకాలపై చర్చికుండా.... పలు మీడియా ఛానళ్లపై విమర్శలు చేశారు. దాంతో ప్లీనరి జరిగిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉండి ఇంత దిగజారతారా? అని పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై వార్తలు రాస్తే తప్పేంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘జగన్ రెడ్డీ.. ప్లీనరీ పెట్టింది ఎవరి కోసమో చెప్పగలరా?. ప్లీనరీ ఎజెండా ప్రజా గళాలను తిట్టిపోయడమా..?. మీరూ మీ చెంచాలు తిడుతున్నది ప్రజలనే అని తెలుసా?. క్యారెక్టర్, క్రెడిబిలిటీలకు మీనింగ్ మీకు తెలుసా?. తల్లినీ, చెల్లినీ పొడిచిన వెన్నుపోట్లు ప్రజలకు తెలియదా?. మీ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని చెప్పగలరా?. మీ పాలన చూసి పొరుగు రాష్ట్రాలు ఎందుకు నవ్వుకుంటున్నాయి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..Read more