నేటి నుంచి దేశ రాజధానిలో రామ్‌లీల... పూర్తయిన ఏర్పాట్లు!

ABN , First Publish Date - 2022-09-26T15:56:47+05:30 IST

ఢిల్లీలోని ఎర్రకోటలో ఈరోజు నుంచి ప్రపంచ ప్రఖ్యాతి...

నేటి నుంచి దేశ రాజధానిలో రామ్‌లీల... పూర్తయిన ఏర్పాట్లు!

ఢిల్లీలోని ఎర్రకోటలో ఈరోజు నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామ్‌లీలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఆర్టిస్టులంతా రిహార్సల్ పూర్తి చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దసరా సందర్భంగా లవకుశ సమితి రామ్‌లీలను నిర్వహిస్తోంది. ఈ రామ్‌లీలలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఏడాది రామ్‌లీలలో బాలీవుడ్‌తోపాటు పలువురు టీవీ ప్రముఖులు పాల్గొననున్నారు. రామ్‌లీలలో సీత పాత్రలో టీవీ నటి డెబ్లీనా ఛటర్జీ నటించనున్నారు. 


రాఘవ్ తివారీ (రాముడు), అఖిలేంద్ర కుమార్ (రావణుడు), అరుణ్ మండోలా (లక్ష్మణుడు), నిర్భయ్ వాధ్వా (హనుమంతుడు), అస్రానీ (నారదుడు) తదితరులు నటించనున్నారు. ఈ నటీనటులందరూ రామ్‌లీల రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. ఈ ఏడాది రామ్‌లీలకు బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ మనోజ్ దర్శకత్వం వహిస్తున్నారని లవ్‌కుష్ రామ్‌లీల కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ తెలిపారు. నెలరోజుల నుండి రామ్‌లీల రిహార్సల్ జరుగుతున్నాయి. దీనికోసం చాలా మంది నటీనటులు దూర ప్రాంతాల నుండి ఢిల్లీకి వచ్చారు. సెప్టెంబరు 26 నుండి అక్టోబర్ 05 వరకు ఎర్రకోటలో దసరా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ రామ్‌లీలను చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తున్నారు.

Read more