BJP MLAకు బురద స్నానం

ABN , First Publish Date - 2022-07-14T15:14:50+05:30 IST

ఈ ఏడాది బాగా వర్షాలు కురవాలని కోరుకుంటూ వాన దేవుడైన వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మహిళలు...

BJP MLAకు బురద స్నానం

గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఈ ఏడాది బాగా వర్షాలు కురవాలని కోరుకుంటూ వాన దేవుడైన వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మహిళలు ఎమ్మెల్యే, నగర్ పాలికా చైర్మన్లపై బురద చల్లిన విచిత్ర ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌లోని పిపర్‌డ్యూరా గ్రామంలో తాజాగా జరిగింది. మహారాజ్‌గంజ్‌లోని పిపర్‌డ్యూరా ప్రాంతానికి చెందిన మహిళలు బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, నగర్ పాలికా చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు బురదతో స్నానం చేయిస్తూ పాటలు పాడారు.వర్షాలు కురవాలని కోరుకుంటూ మహారాజ్‌గంజ్ జిల్లాలో కొందరు మహిళలు స్థానిక ఎమ్మెల్యే, నగర్ పాలిక ఛైర్మన్‌ను మట్టి తొట్టెలో నానబెట్టి, వర్షం దేవుడు వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేశారు. 


బురద స్నానం చేయడం వల్ల ఈ ప్రాంతానికి వర్షం కురిపించే వాన దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చని ఈ ప్రాంతవాసుల నమ్మకం.‘‘నగర అధిపతికి బురద స్నానం చేస్తే వరుణుడు సంతోషిస్తాడని ఒక నమ్మకం. తక్కువ వర్షపాతం వరి దిగుబడిపై తగ్గుతోంది’’ అని మహిళల్లో ఒకరైన మున్నీ దేవి చెప్పారు.వరుణ దేవుడిని సంతోషపెట్టడానికి పిల్లలు బురదలో స్నానం చేస్తారని స్థానికంగా దీనిని కల్ కలూటి అని పిలుస్తారని మున్నీ దేవి చెప్పారు. ఎండవేడిమికి ప్రజలు అశాంతితో ఉన్నారని, వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు బురద స్నానం చేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని ఎమ్మెల్యే కనోజియా తెలిపారు.


కరవు పరిస్థితులు మన ముందున్నాయని, వానదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మహిళలు అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తున్నారని నగర్ పాలికా చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌ అన్నారు.మొత్తం మీద దేశంలో పలు ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం వల్ల భారీవర్షాలు కురుస్తుండగా, మరో వైపు యూపీలోని మహారాజ్‌గంజ్‌ ప్రాంతంలో వర్షాలు కురవక పోవడంతో అక్కడి మహిళలు ఎమ్మెల్యేకు బురద స్నానం చేయించారు.




Updated Date - 2022-07-14T15:14:50+05:30 IST