వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు దారుణం.. భర్త, అత్తమామలు కలిసి ఆ మహిళపై ఎంత దారుణానికి ఒడిగట్టారంటే..

ABN , First Publish Date - 2022-10-03T23:16:32+05:30 IST

ఆ యువతికి ఏడాది క్రితం వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టింది..

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు దారుణం.. భర్త, అత్తమామలు కలిసి ఆ మహిళపై ఎంత దారుణానికి ఒడిగట్టారంటే..

ఆ యువతికి ఏడాది క్రితం వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టింది.. కొన్ని రోజులకే ఆమెకు అసలు విషయం అర్థమైంది.. భర్తకు వేరే యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్టు బయటపడింది.. ఆ విషయమై ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.. గత నెల 24వ తేదీన కూడా ఇద్దరూ గొడవ పడ్డారు.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త, ఆమె తల్లిదండ్రులు ఆ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.. 9 రోజుల చికిత్స అనంతరం ఆమె మరణించింది. 


ఇది కూడా చదవండి..

అర్ధరాత్రి ప్రియుడిని ఇంటికి రమ్మన్న మహిళ.. అక్కడకు వెళ్లిన వ్యక్తికి ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..


బీహార్‌లోని కమర్‌పూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్, అంజలి (24) 2021 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 3 నెలల తర్వాత అంజలికి భర్త వివాహేతర సంబంధం గురించి తెలిసింది. మేనకోడలితోనే భర్త సంబంధం పెట్టుకున్నాడని గ్రహించింది. అప్పట్నుంచి ఇద్దరూ తరచుగా గొడవపడేవారు. దీంతో అంజలిని అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడం ప్రారంభించారు. గత నెల 24న కూడా సూర్య దేవ్, అంజలి తీవ్రంగా గొడవ పడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్యదేవ్.. అంజలిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సూర్యదేవ్ తల్లి, తండ్రి, సోదరుడు కూడా ఆ ఘాతుకంలో పాలు పంచుకున్నారు. 


అంజలి కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అంజలి భర్త, కుటుంబ సభ్యులు పారిపోయారు. అంజలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది. 9 రోజులు చికిత్స అందుకున్న అంజలి ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.  

Read more